
వరంగల్: తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakara rao) అన్నారు. సీఎం కేసిఆర్(kcr), మంత్రి కేటీఆర్ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వరంగల్ ట్రై సిటీస్ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగరం కడిగిన ముత్యంలా అయిందన్నారు.
ఇక్కడి అపార్ట్మెంట్ వాసుల సమస్యలను సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని చెప్పారు.నూతన కార్యవర్గం అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు తీర్చి అందరి మన్ననలు పొందాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అపార్ట్మెంట్ దర్శన్ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకున్నాను,ఇప్పటికే సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు.సమస్యల పరిష్కారానికి ఎప్పటికీ సిద్ధంగా వుంటామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంటన్న,కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు, అసోసియేషన్ అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యవర్గం, అపార్ట్మెంట్స్ ఓనర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి