ఒక్కొక్క‌రు ఒక్కో మొక్క‌ను నాటండి:మంత్రి Errabelli

ABN , First Publish Date - 2022-07-03T20:59:29+05:30 IST

ఈ నెల 4న త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(errabelli) పిలుపునిచ్చారు

ఒక్కొక్క‌రు ఒక్కో మొక్క‌ను నాటండి:మంత్రి Errabelli

హైదరాబాద్: ఈ నెల 4న త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(errabelli) పిలుపునిచ్చారు.తాను త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు (birth day)దూరంగా ఉంటున్నాన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఎవ‌రూ వేడుక‌లు చేయ‌వ‌ద్ద‌నిమంత్రి ఎర్ర‌బెల్లి ఒక ప్రకటనలో కోరారు. వేడుకలకు బ‌దులుగా,ఎవ‌రికి వారుగా మొక్క‌లు నాటాల‌ని, నిరుపేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని కోరారు. 


పుట్టిన రోజు అంద‌రికీ పండుగే. కానీ, నేను నా పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు కూడా నా వేడుక‌లు జ‌ర‌పాల్సిన ప‌ని లేదన్నారు. సీఎం కేసిఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేర‌కు మ‌న‌మంతా క‌లిసి హ‌రిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొందామ‌ని మంత్రి పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-07-03T20:59:29+05:30 IST