కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం అద్వితీయ ప్రగతి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-12-24T01:15:34+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం అద్వితీయ ప్రగతి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం అద్వితీయ ప్రగతి: ఎర్రబెల్లి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం అద్వితీయ ప్రగతి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయ రైతుల దినోత్స‌వం సంద‌ర్భంగా అన్న‌దాత‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి గా వివక్షకు, నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో అద్వితీయ ప్ర‌గ‌తి సాధించింద‌ని అన్నారు. 


దేశంలో 50 శాతానికి పైగా ధాన్యాన్ని ఒక్క మన రాష్ట్రమే అందిస్తున్నదని, దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు. రైతులకు అవసరమైన రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి ప్రభుత్వ పథకాలతో కోటిన్నర ఎకరాలు సాగు జరిగి, దిగుబడులు కూడా అధికమయ్యాయి అని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన పాలసీ, మద్దతు ధర ముందుగానే ప్రకటించాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.కేసిఆర్ ఆలోచనతో నిజమైన రైతు రాజ్యం వస్తుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.


Updated Date - 2021-12-24T01:15:34+05:30 IST