సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రజా నీకం అండగా వుంది: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-03-12T00:55:06+05:30 IST

ఉమ్మ‌డి రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తెలంగాణను అభివృద్ది చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్న ముఖ్య‌మంత్రి కేసిఆర్ కు తెలంగాణ ప్ర‌జానికం అండ‌గా నిలిచింద‌ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయన అన్నారు.

సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రజా నీకం అండగా వుంది: ఎర్రబెల్లి

హైదరాబాద్: ఉమ్మ‌డి రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తెలంగాణను అభివృద్ది చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్న ముఖ్య‌మంత్రి కేసిఆర్ కు తెలంగాణ ప్ర‌జానికం అండ‌గా నిలిచింద‌ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయన అన్నారు. శుక్రవారం మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ వీడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ  అత్య‌ధిక క్రీయాశీల స‌భ్య‌త్వం క‌లిగిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. సంక్షేమ, అభివృద్ది ప‌థ‌కాల అమ‌లులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని మంత్రి  అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం  చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన ప్రతి వారికీ మంచి రాజకీయ భవిష్యతు ఉంటుందని మంత్రి తెలిపారు.  


పార్టీలో చేరిన వారిలో కిష్టపాటి వెంకట్ రెడ్డి, గంగారపు నర్సింహారెడ్డి, వెన్నపూసల పునారెడ్డి, అంబటి నవీన్ రెడ్డి, బాగాల నర్సింహారెడ్డి, పడిగేపాటి చంద్రారెడ్డి, కౌడగాని సిద్దివీరయ్య, మల్ రెడ్డి నవీన్ రెడ్డి, సలగారి రాజు,లింగాల లక్ష్మారెడ్డి తదితరులు చేరారు.ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాషిపెళ్లి యాకయ్య, మండల సీనియర్ నాయకులు సిందే రాంనర్సయ్య, సర్పంచ్ పులిగిల్ల సుధాకర్, బాసిపెళ్లి కోటయ్య,కాంటూరి సత్యనారాయణ,లొనే మహేందర్, యూత్ అధ్యక్షుడు కాంటూరి ప్రవీణ్, పిట్టల సోమయ్య, పిట్టల యాదయ్య,కౌడగానికవిత ఆంజయ్య తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-03-12T00:55:06+05:30 IST