రూ.200 కోట్లు స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలో వేయండి

ABN , First Publish Date - 2021-07-28T19:29:48+05:30 IST

కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఉన్నా కూడా మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 200 కోట్ల రూపాయలను ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటివిడత గా మంజూరు చేసారని

రూ.200 కోట్లు స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలో వేయండి

హైదరాబాద్: కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఉన్నా కూడా మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 200 కోట్ల రూపాయలను ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటివిడత గా మంజూరు చేసారని, అందువల్ల వెంటనే 200 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను కోరారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నున్న మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ ద్వారా అమలు జరుగుతున్న వివిధ పథకాలను బుధవారం నాడు మంత్రి సమీక్షించారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలానే సంకల్పంతో మహిళలు బ్యాంకుల నుండి తీసుకున్న బ్యాంక్ లింకేజిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, అందులో భాగంగానే 200 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని అయన తెలిపారు.


రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయితీరాజ్ శాఖకు చెందిన రోడ్లకు గుంతలు పడ్డాయని, మరికొన్ని రోడ్లు ధ్వసం అయ్యాయని, అందువల్ల క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి రోడ్ల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. అవసరమైన చోట్ల రోడ్లకు మరమ్మతులు చేసి పాదచారులు, వాహనదారుల ప్రయాణాలకు అనుగుణంగా చేయాలని ఆయన కోరారు. 


సెర్ప్ లో అన్ని స్థాయిలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను 30శాతం పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో  సానుకూల నిర్ణయం గైకొన్న ముఖ్యమంత్రికి అయన కృతజ్ఞతలు తెలిపారు. పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి, సెర్ప్ లలో పనిచేసే అధికారులు,ఉద్యోగుల సమస్యలను పెండింగ్ లో ఉంచుకుండా వెంటనే పరిష్కరించాలని అయన కోరారు. కారోబార్లు, ఈ - పంచాయితీ ఆపరేటర్లల పనితీరు కోసం తీసుకోవాల్సిన పరిష్కారాలను ఈ సమీక్ష సమావేశంలో సమీక్షించారు.ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీసందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T19:29:48+05:30 IST