ఉద్యమకారుడు పాలకుడైతే అభివృద్ధిని పరుగులెత్తిస్తాడు:Gangula kamalakar

ABN , First Publish Date - 2022-05-26T20:06:07+05:30 IST

ఉద్యకారుడు పాలకుడైతే అభివృద్ధిని పరుగులెత్తిస్తాడనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ఉదాహరణగా నిలుస్తారని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు

ఉద్యమకారుడు పాలకుడైతే అభివృద్ధిని పరుగులెత్తిస్తాడు:Gangula kamalakar

కరీంనగర్: ఉద్యకారుడు పాలకుడైతే అభివృద్ధిని పరుగులెత్తిస్తాడనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ఉదాహరణగా నిలుస్తారని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు. కరీంనగర్ లో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నగరంలో 9.90 లక్షలతో చేపట్టనున్న కుర్మ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి గంగుల శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కూడా ఇక్కడి ప్రజలు పన్నులు కట్టారు.అయినా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేల కోట్లు విడుదల చేస్తున్నదని చెప్పారు.


కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి,మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు విధ్వంసాన్ని కోరుకోరని, అభివృద్ధిని కాంక్షిస్తారని అన్నారు. సీఎం కేసిఆర్ పాలనలో తెలంగాణలో మతకలహాలు లేకుండా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్న మంత్రి  బిజెపి నేత బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని ఇందుకు గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోందన్నారు.అందుకే ఇక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదుని మంత్రి తెలిపారు.


బండి సంజయ్ గడ్డపారతో తవ్వడం కాదు నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని హితవు పలికారు.బండి సంజయ్ మతకలహాలకు ఆజ్యం పోయడం మానుకుని తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే బండి సంజయ్ మతం ప్రాతిపాదికన ఓట్లు అడిగేందుకు యత్నిస్తున్నారుని ఎద్దేవా చేశారు.పరమతాలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని,ఇంకో మతం గురించి మాట్లాడడం ఏ మతం ఒప్పుకోదన్నారు. 

Updated Date - 2022-05-26T20:06:07+05:30 IST