హరితహారం తెలంగాణకు వరం

ABN , First Publish Date - 2020-08-03T10:44:29+05:30 IST

హరితహారం రాష్ట్రానికి వరం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరా శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆరో విడత

హరితహారం తెలంగాణకు వరం

మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 2: హరితహారం రాష్ట్రానికి వరం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరా శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఆదివారం శ్రీగిద్దెపెరుమాళ్లస్వామి దేవాలయ ప్రాంగణంలో మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై.సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి మొక్కలునాటారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా హరితహారం కార్యక్రమాన్ని ఇంత పకడ్బందీగా నిర్వహించలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. కరీంనగర్‌ను ఆకుపచ్చగా నగరంగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్లు మర్రి భావన, గుగ్గిళ్ల జయశ్రీ, దేవాలయ కమిటీ చైర్మన్‌ కలర్‌ సత్తన్న పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T10:44:29+05:30 IST