అకాల వర్షాలపై మంత్రి గంగుల కమలాకర్ ఆరా

ABN , First Publish Date - 2022-05-04T14:53:48+05:30 IST

రాష్ట్రంలో అకాల వర్షాలపై సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరా తీశారు.

అకాల వర్షాలపై మంత్రి గంగుల కమలాకర్ ఆరా

హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాలపై సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరా తీశారు. వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయిన ధాన్యం కేంద్రాలపై సివిల్ సప్లై అధికారులు, జిల్లా కలెక్టర్ల నుండి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మినహా జిల్లాల్లో  వర్షం ప్రభావం పెద్దగా కనిపించలేదు. కొన్ని జిల్లాల్లో వర్షం ఉన్నందున ధాన్యం తడవకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Read more