బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి Gangula

ABN , First Publish Date - 2022-05-26T17:35:20+05:30 IST

‘‘మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి Gangula

కరీంనగర్: ‘‘మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుందని అన్నారు. సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మసీదులు, దేవాలయాలు కూల్చాలని అనడం సరికాదన్నారు. అల్లర్ల వల్లే గుజరాత్‌కు కంపెనీలు రావడం లేదని తెలిపారు. బేషరతుగా సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలు బాధాకరమని.. ఏ మతం వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఒప్పుకోరని అన్నారు. సంజయ్ లాంటి వ్యక్తుల మాటల వల్ల.. తెలంగాణకు కంపెనీలు రావని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-26T17:35:20+05:30 IST