తెలంగాణ పచ్చగా ఉండడం చూసి ఓర్వలేక కేంద్రం ఇబ్బందులు:Gangula

ABN , First Publish Date - 2022-06-09T00:06:37+05:30 IST

తెలంగాణ పచ్చగా ఉండడం చూసి ఓర్వలేక కేంద్రం ఇబ్బందులు పెడుతోందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar)మండిపడ్డారు

తెలంగాణ పచ్చగా ఉండడం చూసి ఓర్వలేక కేంద్రం ఇబ్బందులు:Gangula

హైదరాబాద్: తెలంగాణ పచ్చగా ఉండడం చూసి ఓర్వలేక కేంద్రం ఇబ్బందులు పెడుతోందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar)మండిపడ్డారు. చిన్న చిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్.సి.ఐ. లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు.ఎఫ్.సి.ఐ.(fci) ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన అన్నారు.2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్రంతో పాటు ఇచ్చాము.90,46,000 కార్డుల్లో 53,00,000 కార్డులకుమాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందని ఆయన అన్నారు. బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం పై 8 నెలల పాటు 980 కోట్ల భారం పడిందిని మంత్రి చెప్పారు. 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని చెప్పారు.11 నెలలు 1134 కోట్ల భారం పడింది. 2022 మార్చిలో లేఖ రాసి ఏప్రిల్ నుంచి ఆర్నెళ్ళు ఉచితబియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖలో రాసింది అన్నారు. 


మూడో దశ కూడా  ఉచితబియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని గుర్తు చేశారు. సేకరణ, ఇతర కారణాల వల్ల ఉచితబియ్యం ఒక నెల ఆలస్యం అయిందననారు.జూన్ నుంచి తెల్ల రేషన్ కార్డు దారులందరికీ సెప్టెంబర్ వరకు ఉచితబియ్యం ఇస్తున్నామని తెలిపారు.ఎఫ్.సి.ఐ.కి అన్ని వివరాలు అందిస్తాం.రెండో దశలో 63 మిల్లుల్లో తేడా అని జూన్ 4న లేఖ రాశారు. దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించమని ఆదేశించాం.రాష్ట్ర ప్రభుత్వ పైసా వృధా కాకుండా చూస్తున్నామని మంత్రి తెలిపారు. చిన్నచిన్న సాకులతో ధాన్యం కొనుగోళ్లు చేయబోమని ఎఫ్.సి.ఐ. ప్రతిసారి బెదిరించడం తగదన్నారు. 


ఎఫ్.సి.ఐ. బియ్యం తీసుకోవాల్సిందేనన్నారు.ఇన్నేళ్లు ఎప్పుడూ లేనిది ఎఫ్.సి.ఐ. మాపై ఎందుకు దాడి చేస్తోందన్నారు. ఫ్.సి.ఐ. ఇలాంటి వన్నీ మానుకొని ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆయిల్ కంపెనీలు మా పరిధిలో లేవు.పెట్రోల్, డీజిల్ కు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. సాయంత్రం వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. స్టాకు ఉండి ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడుతున్నామని, కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Updated Date - 2022-06-09T00:06:37+05:30 IST