అవసరమైతే Ex Ministerను విచారిస్తాం..

ABN , First Publish Date - 2022-05-12T18:08:11+05:30 IST

కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య కేసులో అవసరమైతే పోలీసులు మాజీ మంత్రి ఈశ్వరప్పను అదుపులోకి తీసుకుని, విచారిస్తారని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర

అవసరమైతే Ex Ministerను విచారిస్తాం..

                     - Home minister ఆరగ జ్ఞానేంద్ర 


బెంగళూరు: కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య కేసులో అవసరమైతే పోలీసులు మాజీ మంత్రి ఈశ్వరప్పను అదుపులోకి తీసుకుని, విచారిస్తారని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఎవరినీ రక్షించే ప్రసక్తే లేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందన్నారు. పోలీసులకు ఎవరి అవసరం ఉంటే వారికి నోటీసులు ఇస్తారన్నారు. ఇందులో తమ జోక్యం ఉండదన్నారు. సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యకే సు ఉడుపి ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోందని, ఈ శ్వరప్పకు నోటీసులు ఇచ్చే విషయం పోలీసుల నిర్ణయమన్నారు. ఎస్‌ఐ పోస్టుల నియామకాల్లో అక్రమాలపై ఇప్పటికే పలువురిని సీఐడీ అరెస్టు చేసి విచారణ జరుపుతోందన్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ కు చెందిన కింగ్‌పిన్‌లు ఉన్నారన్నారు. హోంశాఖ మంత్రిగా ఎటువంటి నిరుత్సాహం లేదని సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Read more