సంగమేశ్వర ఎత్తిపోతలతో సంగారెడ్డి సస్యశ్యామలం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-06-09T22:58:19+05:30 IST

జిల్లాలో నిర్మించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం

సంగమేశ్వర ఎత్తిపోతలతో సంగారెడ్డి సస్యశ్యామలం: హరీష్‌రావు

 సంగారెడ్డి: జిల్లాలో నిర్మించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కాబోతోందని ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించి సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి రెండు లిఫ్ట్‌లతో సాగు నీరు అందిస్తామని హరీష్‌రావు తెలిపారు. రెండు లిఫ్ట్ ఇరిగేషన్లతో సంగారెడ్డి, ఆందోలు, జహీరాబాద్, నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 3.87 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని మంత్రి వివరించారు.


 సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులకు రూ. 16 కోట్లు, బసవేశ్వర ఎత్తిపోతల సర్వే పనులకు రూ. 11 కోట్లు మంజూరు అయనట్లు అయన పేర్కొన్నారు. రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టడం చారిత్రక నిర్ణయమన్నారు.  వీటిని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 12న ఎత్తిపోతల పథకాల సర్వే పనులు ప్రారంభమవుతాయని హరీష్‌రావు పేర్కొన్నారు. రెండు నెలల్లో సర్వే పూర్తి చేసి టెండర్లు పిలిచి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-06-09T22:58:19+05:30 IST