కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయాకు హరీష్‌రావు లేఖ

ABN , First Publish Date - 2022-01-18T16:35:36+05:30 IST

కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయాకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు.

కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయాకు హరీష్‌రావు లేఖ

హైదరాబాద్: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయాకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని కోరారు. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని తెలిపారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు తమ ముందు ఉంచుతున్నామని మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-18T16:35:36+05:30 IST