Harish rao: మహిళా చైతన్యం, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ
ABN , First Publish Date - 2022-09-26T18:19:45+05:30 IST
మహిళా చైతన్యం, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి హరీష్రావు అన్నారు.
సిద్ధిపేట: మహిళా చైతన్యం, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి హరీష్రావు(Harish rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్రావు (Telangana minister) పేర్కొన్నారు.