చిన్నారికి అండగా నిలిచిన మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2021-05-09T06:14:20+05:30 IST

కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన ఓ చిన్నారికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అండగా నిలిచారు.

చిన్నారికి అండగా నిలిచిన మంత్రి హరీశ్‌రావు
చికిత్స పొందుతున్న చిన్నారి, తండ్రి శ్రీధర్‌కు ఎల్‌వోసీ పత్రాన్ని అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు

 సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.1లక్ష ఎల్‌వోసీ అందజేత

చేర్యాల, మే 8: కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన ఓ చిన్నారికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అండగా నిలిచారు. కొద్దిరోజుల క్రితం  కొండా శాన్విత అనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ కిందపడిపోవడంతో ముక్కుకు బలమైన గాయమై తీవ్రంగా రక్తస్రావం జరిగింది. సిద్దిపేటలోని ఆస్పత్రిలో చేర్పించినా 2యూనిట్ల తెల్లరక్తకణాలున్న రక్తం అవసరం కావడంతో తండ్రి కొండా శ్రీధర్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న టీహెచ్‌ఆర్‌ బ్లడ్‌ డోనర్స్‌ టీం సభ్యులు స్పందించి రక్తదానం చేశారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రాత్రికిరాత్రే హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్చించారు. కానీ తండ్రి శ్రీధర్‌ సాధారణ కుటుంబీకుడు కావడంతో చికిత్సకయ్యే డబ్బులు భరించే స్థోమత లేకపోవడంతో ఈ విషయమై ఆకుబత్తిని రాము మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో మంత్రి హరీశ్‌రావు స్పందించి పాప ఆరోగ్యపరిస్థితి తెలుసుకుని సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.1లక్ష విలువగల ఎల్‌వోసీని మంజూరీ చేయించారు. శనివారం ఉదయం హైదరాబాదులోని మంత్రి నివాసంలో తండ్రి శ్రీధర్‌కు ఎల్‌వోసీని అందజేయడంతో మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2021-05-09T06:14:20+05:30 IST