ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్: మంత్రి హరీష్‌రావు

Published: Mon, 07 Mar 2022 09:50:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడవ సారి తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నానని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం ఉదయం కోకాపేట్‌లోని నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ...ఉదయం 11:30 గంటలకు శాసన సభలో తాను, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.