
హైదరాబాద్:వనజీవి రామయ్య(ramiah) ఆరోగ్యంపై పర్యావరణ,అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indra karan reddy) ఆరా తీశారు.పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకున్నారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి