
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా 1736 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు వర్తింపచేసేందుకు రూ. 12.50 కోట్లు , బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు, హరితహార కార్యక్రమానికి రూ.932 కోట్ల బడ్జెట్ లో కేటాయింపులు చేసినందుకు సీఎం కు కృత్ఞతలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిశారు.
ఇవి కూడా చదవండి