ఐఎఫ్ఎస్ ర్యాంక‌ర్ రాజును స‌త్కరించిన మంత్రులు

ABN , First Publish Date - 2022-07-09T19:40:27+05:30 IST

తొలి ప్ర‌య‌త్నంలోనే ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్(IFS) )లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాస‌ర్ల రాజును మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డ,(indrkaran reddy) త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్(talasani), మ‌హ‌మూద్ అలీ(mahmood ali) సత్కరించారు.

ఐఎఫ్ఎస్ ర్యాంక‌ర్ రాజును స‌త్కరించిన మంత్రులు

హైదరాబాద్: తొలి ప్ర‌య‌త్నంలోనే ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్(IFS) )లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాస‌ర్ల రాజును మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డ,(indrkaran reddy) త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్(talasani), మ‌హ‌మూద్ అలీ(mahmood ali) సత్కరించారు.ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  ఆద్వ‌ర్యంలో అర‌ణ్య భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన‌  అభినందన సత్కార సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్‌సీఆర్ఐ(FCRI) త‌ర‌పున ల‌క్ష రూపాయాల ప్రోత్స‌హ‌కాన్ని రాజుకు అంద‌జేశారు. రాజుతోమంత్రులు కాసేపు ముచ్చటించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూఅడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో పాటు జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను నెలకొల్పార‌ని అన్నారు.  


FCRI  స్థాపించిన అన‌తి కాలంలోనే  కాస‌ర్ల రాజు వంటి వారు  తొలి ప్ర‌య‌త్నంలోనే ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ సాధించ‌డం అట‌వీ క‌ళాశాల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.జనగామ జిల్లా సూరారం గ్రామంలోని ఓ సాధ‌ర‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన రాజు ఎంతో క‌ష్ట‌ప‌డి  ఐఎఫ్‌ఎస్ సాధించి పేద‌రికం ప్ర‌తిభ‌కు అడ్డంకి కాద‌ని నిరూపించారని అన్నారు. యువతకు ఆద‌ర్శంగా నిలిచారని కొనియాడారు. రాజును స్ఫూర్తిగా మరింత మంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.జాతీయ స్థాయి పోటీ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించేందుకు వీలుగా  విద్యార్థుల‌కు ఉన్న‌త‌మైన విద్యా బోధ‌న‌ను అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.  


ఐఎఫ్ఎస్  ర్యాంక‌ర్ రాజు మాట్లాడుతూ త‌న‌కు త‌న పేరెంట్స్ ఎంతో స‌పోర్ట్ ఇచ్చార‌ని, FCRI  నుంచి మంచి గైడెన్స్ ల‌భించింద‌న్నారు. త‌న జ‌ర్నీలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ క్రెడిట్ ద‌క్కుతుంద‌ని చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో అట‌వీ శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్  (కంపా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్) లోకేష్ జైస్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-09T19:40:27+05:30 IST