ముక్కోటి వృక్షార్చ‌న గ్రాండ్ స‌క్సెస్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-24T22:48:56+05:30 IST

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్మ‌ల్లో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చ‌న గ్రాండ్ సక్సెస్ అయ్యిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

ముక్కోటి వృక్షార్చ‌న గ్రాండ్ స‌క్సెస్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మ‌ల్: టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్మ‌ల్లో నిర్వహించిన  ముక్కోటి వృక్షార్చ‌న గ్రాండ్ సక్సెస్ అయ్యిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నియోజక వర్గంలో ఘనంగా నిర్వహించిన కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు గులాబీ నేతలు, కార్యక‌ర్త‌లు, అభిమానులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు. ముక్కోటి  వృక్షార్చనతో కేటీఆర్ కు  జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఎంపీ సంతోశ్​ చేపట్టిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున  మొక్క‌లు నాటారు. 


అట‌వీ శాఖ ఆద్వ‌ర్యంలో కొండాపూర్ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారికి ఇరువైపుల ముక్కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా 3 ల‌క్ష‌లు మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు పచ్చదనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు రాష్ర్టాభివృద్ధితో పాటు భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని అందించేందుకు  ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి ముందుతరాలకు ఆదర్శంగా నిలువాలని సూచించారు. 

వర్టికల్ గార్డెన్ ను ప్రారంభించిన మంత్రి

అనంత‌రం నిర్మ‌ల్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రేక్ష‌కుల గ్యాల‌రీలో 60 వేల మొక్క‌ల‌తో ఏర్పాటు చేసిన వ‌ర్టిక‌ల్ గార్డెన్ ను,మన నిర్మ‌ల్ లోగోను మంత్రి  ప్రారంభించారు. వర్టికల్ గార్డెన్ వల్ల స్టేడియానికి, ప‌ట్ట‌ణానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ వ‌చ్చింద‌ని మంత్రి తెలిపారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేయ‌డంతో పాటు  సుందరీకరణ అద్భుతమైన రీతిలో ఉండేలా కృషి చేస్తున్నామ‌న్నారు. అలాగే నిర్మ‌ల్ మున్సిప‌ల్ శాఖ అద్వ‌ర్యంలో మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.


ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హించిన ఈ వేడుక‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొని కేక్ క‌ట్ చేశారు. ఈ కార్యక్ర‌మంలో  డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి, క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు వేణుగోపాల చారి, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పాల్గొన్నారు.ఇక 300 పాల ప్యాకెట్లను భారీ వ‌ర్షాల ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి పంపిణీ చేశారు. 

Updated Date - 2021-07-24T22:48:56+05:30 IST