సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతో యాదాద్రి పునర్నిర్మాణం: ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-04T01:46:30+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైన స్టపతులు, ఇంజనీర్లు, జిల్లా పోలీస్ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇతరులను ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఆదివారం సన్మానించారు.

సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతో యాదాద్రి పునర్నిర్మాణం: ఇంద్రకరణ్ రెడ్డి

యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో  భాగస్వామ్యమైన స్టపతులు, ఇంజనీర్లు, జిల్లా పోలీస్ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇతరులను ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఆదివారం సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిమించుకున్నాం.మహకుంభ సంప్రోక్షణ మహోత్సవం రోజున సమయభావం వల్ల సీఎం కేసీఆర్ అందరిని సన్మానించలేకపోయారు. మిగితా వారిని కూడా సగౌరవంగా సత్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని ఈరోజు ఆత్మీయ సత్కారం చేసుకుంటున్నామని అన్నారు.  


ఆలయ పునర్నిర్మాణంలో మీ సేవలు మరువలేనివి, మీకు రెండు చేతులతో నమస్కరిస్తున్నానని అన్నారు.ఆలయ పున: ప్రారంభం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలో టెంపుల్ టూరిజం అభివృద్దికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఆధ్యాత్మికం తో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అన్నారు. 


ఈసందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహత్కార్యం లో భాగస్వామ్యమైన వారిని సన్మానించు కోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. పునాది రాయి వేసినప్పటినుంచి పున: ప్రారంభం వరకు ఎంతో మంది భాగస్వామ్యం ఉంది. ఎన్నో మంచి పనులతో కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆ అతి కొద్ది మందిలో సీఎం కేసీఆర్ ఒకరని అన్నారు. అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న గొప్ప దార్శనికవాది సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-04T01:46:30+05:30 IST