ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆన్​లైన్​లో బోనం:Indrakaran reddy

ABN , First Publish Date - 2022-06-17T00:33:45+05:30 IST

ఉజ్జయినీ మహంకాళీ(ujjaini mahakali) అమ్మవారికి ఆన్ లైన్ లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింద‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు.

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆన్​లైన్​లో బోనం:Indrakaran reddy

హైద‌రాబాద్: ఉజ్జయినీ మహంకాళీ(ujjaini mahakali) అమ్మవారికి ఆన్ లైన్ లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింద‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. గురువారం అర‌ణ్య భ‌వ‌న్ లో ఉజ్జయినీ మహంకాళీ, బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌ అమ్మవారికి  బోనం స‌మ‌ర్పించేందుకు ఆన్ లైన్ సేవ‌లను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లాంఛ‌నంగా ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఆల‌య నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తార‌ని,గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తార‌న్నారు.  


ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం ప్రసాదంలా పంపిణీ చేస్తారని, వాటిని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చన్నారు.బియ్యంతో పాటు బెల్లం, అక్షింత‌లు, ప‌సుపు -కుంకుమ పంపిస్తార‌ని చెప్పారు.ఉజ్జ‌యిని మహంకాళీ అమ్మ‌వారికి ఆన్ లైన్ లో బోనం స‌మ‌ర్పించే భ‌క్తుల‌కు జూలై 4 నుంచి ఈ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు.TAPP FOLIO, మీ సేవ, ఆల‌య వెబ్ సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా దేశ‌, విదేశీ భ‌క్తులు ఈ సేవ‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు.దేశీయ సేవ‌ల‌కు గానూ రూ.300, అంత‌ర్జాతీయ సేవ‌ల‌కు గానూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియ‌ర్ సేవ‌ల ద్వారా  దేశీయ భ‌క్తుల ఇంటికి చేర‌వేస్తార‌ని వెల్ల‌డించారు.  

Updated Date - 2022-06-17T00:33:45+05:30 IST