ఉద్యోగాల అక్రమ నియామకాల్లో మంత్రి హస్తం

ABN , First Publish Date - 2022-05-21T06:46:20+05:30 IST

నిర్మల్‌ పురపాలక సంఘ పారిశుద్ధ్య ఉద్యోగాల నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, దీని వెనుక మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిహస్తం ఉందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

ఉద్యోగాల అక్రమ నియామకాల్లో మంత్రి హస్తం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మహేశ్వర్‌రెడ్డి

ఏఐసీసీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణ

నిర్మల్‌ అర్బన్‌, మే 20 : నిర్మల్‌ పురపాలక సంఘ పారిశుద్ధ్య ఉద్యోగాల నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, దీని వెనుక మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిహస్తం ఉందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పారిశుద్ధ్య విభాగంలో 43 ఉద్యోగాలకు.. ఉద్యోగా నికి 15 నుండి 20 లక్షలు వసూలు చేశారని విమర్శించారు. మున్సిపల్‌ చైర్మన్‌ కుటుంబసభ్యులకు, మరికొంత మంది బంధువులకు ఈ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంప్లాయి మెంట్‌ నిబంధనలు పాటించకుండా పారిశుద్ధ్య ఉద్యోగాలను అంగట్లో అమ్మే శారని దుయ్యబట్టారు. వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఆం దోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అక్రమ నియామకాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ బంధువులు, సన్నిహితులను నియమించారని ఇంత భారీ అక్రమాలు జరుగుతున్నా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిం చారు. అక్రమ నియామకాల్లో మంత్రి హస్తం ఉందని ఆరోపించారు. అక్రమ నియామకాలు వెంటనే రద్దు చేయకపోతే సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కార్యాలయాలను ము ట్టడిస్తామని ఆయన ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సి లర్‌ అయ్యన్నగారి పోశెట్టి, మామడ మండల మాజీ బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బాపూరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు నాందేడపు చిన్ను, మార గంగారెడ్డి, జమాల్‌, మోహినుద్దీన్‌, అజహర్‌, జునైద్‌, బోరిగాం మధుకర్‌, సంతోష్‌, రఫూ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:46:20+05:30 IST