పాడి పరిశ్రమకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-07-22T06:34:34+05:30 IST

పాడి పరిశ్రమకు ప్రాధాన్యం

పాడి పరిశ్రమకు ప్రాధాన్యం
మంత్రి జగదీశ్‌రెడ్డిని సత్కరిస్తున్న ఎన్‌ఎస్‌ఆర్‌ డెయిరీ చైర్మన్‌ సంపత్‌రావు

రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

దామెర, జూలై 21: రాష్ట్రంలో పాడి రైతులను ప్రోత్సహించడం కోసం పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దామెర మండలం దుర్గంపేటలోని ఎన్‌ఎస్‌ఆర్‌ డెయిరీని బుధవారం మంత్రి సందర్శించారు. డెయిరీలోని పాల ఉత్పత్తుల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తుల తయారీ, పాల సేకరణ, విక్రయం వంటి వివరాలను డెయిరీ చైర్మన్‌ నాయినేని సంపత్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం కోసం అనేక రాయితీలను అందిస్తున్నట్లు గుర్తుచేశారు. అంతే కాకుండా పాడి రైతులకు మేలు జాతి గేదెలను రాయితీలపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతులను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఎన్‌ఎస్‌ఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ నాయినేని సంపత్‌రావుతో పాటు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌(టీఈఈఏ) ట్రాన్స్‌కో జిల్లా అధ్యక్షుడు ఎల్‌.సంపత్‌రావులు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎన్‌ఎస్‌ఆర్‌ గ్రూప్‌ ఎం.డీ నిఖితారావు తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-22T06:34:34+05:30 IST