
హైదరాబాద్: నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ(ganga nursery) మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి(mango seed) పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగ గా నామకరణం చేశారు.ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ సి మోహన్ ఆ వంగడాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో(jagadish reddy) ఆవిష్కరింప జేశారు.ఆధునిక పరిజ్ఞానం తో ఫార్మ్ హౌజ్ లకు సరికొత్త డిజైన్ లను రూపొందించే మోహన్ మామిడిలో నూతన వంగడాన్ని సృష్టించడం అద్భుతమైన ప్రయోగంగ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి