సూర్యపేటలో వినూత్నంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-20T20:56:30+05:30 IST

నిన్నటి ఉద్యమ నేత నేటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా ఇళ్లకే వచ్చి కల్యాణలక్ష్మీ,షాది ముబారక్ చెక్ లు అందచేస్తుంటే అక్కడి మహిళలు పట్టారని సంతోషం వ్యక్తం చేశారు

సూర్యపేటలో వినూత్నంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

సూర్యాపేట: నిన్నటి ఉద్యమ నేత నేటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా ఇళ్లకే వచ్చి కల్యాణలక్ష్మీ,షాది ముబారక్ చెక్ లు అందచేస్తుంటే అక్కడి మహిళలు పట్టారని సంతోషం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లలో జరుగుతున్న పెండ్లిళ్లకు ఆడపడుచు కట్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన  షాదిముబారక్ చెక్ లు నేరుగా తమ చెంతకే చేరుతుండడంతో నారి లోకం సదరు నేతకు నీరాజనం పట్టింది. ఇంటింటికీ కలియ తిరుగుతూ కాలి నడకన బయలు దేరిన మంత్రికి ఆయా వార్డుల ప్రజలు ముఖ్యంగా మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గురువారం రోజున సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో ఈ సంఘటన విశేషంగా జనాలను ఆకర్షించింది. 


విషయానికి వస్తే సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి, షాదిముబారక్ పధకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంజూరు చేయించారు.లబ్ధిదారులకు ఆ మొత్తాలను చెక్కుల రూపంలో అందించేందుకు అధికారులు కార్యక్రమాన్ని రూపొందించారు.అయితే పేదింట్లో జరిగే పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కట్నాన్నిగతానికి భిన్నంగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి సంకల్పించారు. సంకల్పానికి అనుగుణంగా ఉండాలని కాలి నడకన ఆయా కాలనీలలో కలియ తిరుగుతూ, పట్టణ వాసులను పేరు పేరు నా పలకరిస్తూ ఇంటికే చేరి చెక్ లను అందజేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి హారతిలిస్తూ నారిలోకం బ్రహ్మరథం పట్టింది.ఇంటికి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డితో ఫోటోలు దిగేందుకు కుటుంబ సభ్యులు పోటీపడ్డారు.

Updated Date - 2022-01-20T20:56:30+05:30 IST