
యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో పునర్ నిర్మితమైన శ్రీశ్రీశ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి మహాకుంభ సంప్రోక్షణలో విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి సునీతా దంపతులు ఆగమన శాస్త్రాన్ని అనుసరించి మిధునా లగ్నకాలంలో వేద పండితుల మంత్రోచ్చారణాల నడుమ సప్తతల రాజగోపురంపై స్వామి వారికి సంప్రోక్షణ నిర్వహించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ దేవాలయం లో సప్తతల రాజగోపురం యాదాద్రి దేవాలయంలో అత్యంత ఎతైనది. అటువంటి ఎత్తైన రాజగోపురంపై ప్రత్యేకించి 11 కళాశాలతో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు.అటువంటి అరుదైన అవకాశం జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఇంత అద్భుతమైన నిర్మాణం ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. ఆలయ పునర్ నిర్మాణం యావత్ ప్రపంచంలోనే అరుదైన ఘట్టమని అన్నారు. ఈ ఘట్టంలో పాలుపంచుకోవడం మహాద్బగ్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతోజిల్లా మంత్రిగా పాలు పంచుకోవడం మహ ద్బాగ్యాం గా భావిస్తున్నాన్నారు.అటువంటి దేవాలయానికి అన్నీ తానై శిల్పి అవతరమెత్తి యాదాద్రి పునర్ నిర్మాణం రూపంలో అద్భుతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించారని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి