
Hyderabad: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amith shah) వ్యాఖ్యలపై Telangana Minister జగదీష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశంలో అబద్దాలు ఆడిన హోం మంత్రిగా అమిత్‌షా రికార్డు సృష్టించారని జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికార మార్పిడి కాదు.. ఢిల్లీ గద్దె నుంచి బీజేపీ దిగిపోవడం ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి జోస్యం చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న చీకట్లు తెలంగాణలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌తో ముప్పుందనే బీజేపీ నేతలకు భయం పుట్టుకుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల రహస్య ఒప్పందాన్ని త్వరలో బయటపెడతామని జగదీష్‌రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి