కేంద్రం తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది: మంత్రి Jagdish

ABN , First Publish Date - 2022-04-04T18:31:44+05:30 IST

తెలంగాణాను ఆదర్శంగా చూపాల్సిన కేంద్రం తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

కేంద్రం తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది: మంత్రి Jagdish

సూర్యాపేట: తెలంగాణాను ఆదర్శంగా చూపాల్సిన కేంద్రం తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారని తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందన్నారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవని తెలిపారు. పంజాబ్‌లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం ఎటువంటి సహాయం చేయకున్నా రైతులకు సమృద్ధిగా నీరు అందించామని తెలిపారు. దేశంలోనే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు సాదించిన రాష్ట్రంగా తెలంగాణాను మొదటి స్థానంలో నిలిపామన్నారు. కోతల దశలో ఉన్న సమయంలో మెడ మీద కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకాలు పెట్టించుకున్నారని ఆగ్రహించారు. వరి వెయ్యొద్దని చెప్పినా ప్రతిపక్ష బీజేపీ నాయకులు రైతులను మోసం చేసేలా వరి వేయమని ప్రోత్సహించి మోసం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. 

Updated Date - 2022-04-04T18:31:44+05:30 IST