Jagadish reddy: కేంద్ర విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తాం

ABN , First Publish Date - 2022-08-30T20:59:34+05:30 IST

కేంద్రం జారీ చేసిన విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేపడతామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Jagadish reddy: కేంద్ర విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తాం

సూర్యాపేట: కేంద్రం జారీ చేసిన విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేపడతామని మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish reddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ (Central government) ఉత్తర్వులు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినవని.. పూర్తి అసంభద్దమైనవన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ఉత్తర్వులు ఇచ్చిందని మండిపడ్డారు. అందుబాటులో ఉన్న వనరులతో దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వచ్చని కేసీఆర్ (KCR) చెప్పడం బీజేపీ (BJP)కి రుచించడం లేదని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని కేసీఆర్ (Telangana CM) దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారన్నారు. తెలంగాణకు 12,941 కోట్లు రావాలని చెబుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తెలంగాణ వాదనలు వినకుండా ఆంధ్రా వాదనలు విని కేంద్రం ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. సంవత్సర కాలంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-30T20:59:34+05:30 IST