TS News.. కేంద్రం ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తాం: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-30T21:46:13+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

TS News.. కేంద్రం ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తాం: మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట (Suryapet): కేంద్ర ప్రభుత్వం (Central Govt.) ఇచ్చిన విద్యుత్ ఉత్తర్వుల (Electricity orders)పై న్యాయపోరాటం చేస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagdish Reddy) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) విద్యుత్‌ డిస్కమ్‌లకు  చెల్లించాల్సిన రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లో ఇవ్వాలని కేంద్రం తెలంగాణ (Telangana) డిస్కమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే కేంద్ర సర్కార్ ఈ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. వనరుల వినియోగంతో దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న.. సీఎం కేసీఆర్ (CM KCR) వ్యాఖ్యలు బీజేపీ (BJP)కి రుచించడం లేదన్నారు. తెలంగాణకు రూ. 12,941 కోట్లు రావాలంటున్నా పట్టించుకోవడం లేదని, కేంద్రం ఏకపక్షంగా ఏపీ వాదనలే విని ఉత్తర్వులు ఇస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లో ఇవ్వాలని కేంద్రం తెలంగాణ డిస్కమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 92 ప్రకారం.. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌ సరఫరా చేసిన విద్యుత్‌కు గాను అసలు కింద రూ.3,441.78 కోట్లు.. వడ్డీ రూ.3,315.14 కోట్లు కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లను నెలలో చెల్లించాలని కేంద్ర ఇంధన శాఖ సోమవారం ఆదేశించింది. రాష్ట్ర విభజన జరిగాక.. ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్‌ ఉండేది. దీనిని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే అందుకు బిల్లులు చెల్లించకపోగా.. తమకే ఏపీ బకాయిపడిందని వాదిస్తూ వస్తోంది. ఈ బకాయిలు 2019 నాటికి రూ.4,800 కోట్లను దాటేశాయి. ఈ మొత్తాన్ని తెలంగాణ చెల్లిస్తే పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని రాష్ట్రప్రభుత్వం భావించింది. కానీ ఆ రాష్ట్రం లెక్కచేయలేదు. దీనిపై కేంద్రానికి ఏపీ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూనే వస్తోంది. తెలంగాణ డిస్కమ్‌లు దివాలా తీసినట్లుగా ప్రకటించాలని  ట్రైబ్యునల్‌ను కూడా ఆశ్రయించింది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీని కలసినప్పుడు తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేయాలని కేంద్ర ఇంధన శాఖ ఆ రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డిస్కమ్‌లకు, జెన్కోకూ లేఖ రాసింది.

Updated Date - 2022-08-30T21:46:13+05:30 IST