వరికి బదులుగా ఆయిల్ పామ్ సాగు: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2022-02-24T00:46:04+05:30 IST

రాష్ట్రంలో బోర్ల కింద వరి సాగుకి బదులుడి ఆయిల్ పామ్ సాగును

వరికి బదులుగా ఆయిల్ పామ్ సాగు: మంత్రి కన్నబాబు

అమరావతి: రాష్ట్రంలో బోర్ల కింద వరి సాగుకి బదులుగా ఆయిల్ పామ్ సాగును పెంచేలా ప్రచారం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంపై అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ విస్తరణను వేగవంతం చేయాలన్నారు. మెట్ట ప్రాంతాల్లో వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటగా, ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అనువైన మెట్ట ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతాలను మ్యాపింగ్ చేసేందుకు నిపుణులతో కూడిన అధికార బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.


కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ విస్తరణకు సహాయం చేసేందుకు సుముఖంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సీడ్ ఉత్పత్తిని పెంచాలని ఆయన పేర్కొన్నారు.  ప్రైవేట్ సంస్థలే  కాకుండా హర్టీకల్చర్ విభాగం  కూడా నర్సరీల్లో ఆయిల్ పామ్ మొక్కల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో ఆయిల్ పామ్ మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే ప్రతి రైతుకు మొక్కలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

Updated Date - 2022-02-24T00:46:04+05:30 IST