మామిడి, టమాటా మార్కెట్‌పై దృష్టి పెట్టండి : కన్నబాబు

ABN , First Publish Date - 2021-05-08T00:02:43+05:30 IST

వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి కురసాల కన్నబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మామిడి, టమాటా మార్కెట్‌పై దృష్టి పెట్టండి : కన్నబాబు

అమరావతి : వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి కురసాల కన్నబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో మామిడి, టమోటా మార్కెట్‌లపై ప్రత్యేక దృష్టి నిలిపామని తెలిపారు. అంతేకాకుండా సీఎం జగన్ ఆదేశాలతో పండ్ల ధరలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు. కృష్ణా జిల్లాలోని నున్న మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్‌లలోకి రైతులు రాత్రులు కూడా సరుకులు తీసుకువచ్చిన  తర్వాత తిరిగి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు. మామిడి ధరలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. మామిడి ప్రాసెసింగ్ యూనిట్స్ ధరల విషయంలో రైతులకి న్యాయం చేసేట్లు వ్యవహరించాలని, ఉద్దేశపూర్వకంగా ధరల్ని మాత్రం తగ్గించవద్దని ఆదేశించారు. 


అలాగే టమోటా ధరలు కూడా పడిపోకుండా చూసుకోవాలని, 2000 టన్నుల టమోటాలను ప్రాసెసింగ్ యూనిట్స్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రేడర్లకు పాసులు ఇవ్వాలని, సిల్క్ రీలింగ్ యూనిట్స్, ప్రభుత్వ కకూన్స్ మార్కెట్లు నిర్వహించాలని మంత్రి కన్నబాబు నిర్ణయించారు. అలాగే ఉద్యానవన ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా కర్ఫ్యూ నిబంధల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి కన్నబాబు ప్రకటించారు. 

Updated Date - 2021-05-08T00:02:43+05:30 IST