Minister Karumuri: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంటనూనెల ధరలు పెరిగాయి..

ABN , First Publish Date - 2022-09-15T16:40:14+05:30 IST

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంటనూనెల ధరలు పెరిగాయని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు.

Minister Karumuri: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంటనూనెల ధరలు పెరిగాయి..

అమరావతి (Amaravathi): రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం కారణంగా వంటనూనెల ధరలు పెరిగాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri) అన్నారు. వంటనూనెల ధరలు పెరుగులపై శాసనమండలి (Legislative Council)లో విపక్షాలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నందున వంటనూనె ధరలు తగ్గాయన్నారు. ఏపీ ఆయిల్ ఫెడ్ (AP Oil Fed) ద్వారా రైతుబజార్లో సన్ ఫ్లవర్ 153, పామాయిల్ 105, వేరుశనగ నూనె 161 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పారు. ఎల్‌పీజీ రీఫిల్ ధరను కేంద్రం 50 రూపాయలు పెంచిందని, ఆ ప్రకారం రాష్ట్రంలో ధర పెరిగిందని మంత్రి కారుమూరి సమాధానమిచ్చారు.   

Updated Date - 2022-09-15T16:40:14+05:30 IST