తెలుగు సినీ రంగానికి ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు- కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-05-01T21:25:57+05:30 IST

తెలుగు సినీ రంగానికి ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు వచ్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

తెలుగు సినీ రంగానికి ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు- కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలుగు సినీ రంగానికి ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు వచ్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక దర్శక నిర్మాతలు, నటీనటులతోపాటు కార్మికుల కృషి ఎంతో వుందన్నారు. ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారని గుర్తు చేశారు. ఇప్పుడు మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. సినీ రంగంలోని 24 విభాగాలు కరోనా వల్ల చాలా ఇబ్బందిపడ్డారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్ రావడం వల్ల మళ్లీ పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయని చెప్పారు.కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలని మంత్రి తెలిపారు.తెలుగు సినీపరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు వెనక దర్శక, నిర్మాతలతో పాటు కార్మికుల కృషి ఎంతో ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. 


Updated Date - 2022-05-01T21:25:57+05:30 IST