మేడారం జాతర నిర్వహణకు కేంద్రం రూ.2.5 కోట్ల నిధుల కేటాయింపు:కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-13T22:09:28+05:30 IST

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ,పర్యా టక మంత్రిత్వ శాఖల ద్వారా రు.2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రసాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రకటించారు

మేడారం జాతర నిర్వహణకు కేంద్రం రూ.2.5 కోట్ల నిధుల కేటాయింపు:కిషన్ రెడ్డి

హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ,పర్యా టక మంత్రిత్వ శాఖల ద్వారా రు.2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రసాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రకటించారు.ఈ నెల 16న ప్రారంభం అయ్యే సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో, ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. గిరిజన సాంస్కృతిక, వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కేంద్రప్రభుత్వ పాత్రపై కేంద్ర మంత్రి చెబుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజల ప్రత్యే కసంస్కృతి, వారసత్వాన్ని ఎంతో గౌరవిస్తుందని మంత్రి తెలిపారు.  


జాతరను నిర్వహణకు కేంద్రగిరిజన మంత్రిత్వశాఖ ద్వరా నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు.ఈ నిధులను మేడారంలోని చిలకల గుట్ట చుట్టూ సంప్రదాయ రీతిలో 500 మీటర్ల కాంపౌండ్ గోడను నిర్మించటానికి, దానికి అనుసంధానంగా 900 మీటర్ల మెష్ ను ఏర్పా టు చేయటానికి, గోడల మీద గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా అధ్భుతమైన చిత్రాలను వేయటానికి, గిరిజన మ్యూజియంలో డిజిటల్ సమాచార కేంద్రాలు ఏర్పా టు, గిరిజన మ్యూజియం పరిసరాలలో కోయ గ్రామాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలుచేపట్టడానికి వినియోగిస్తామన్నారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఐలాపూర్ సమ్మక్క జాతర, చిరుమల్ల సమ్మక్క జాతర, సాదలమ్మ తిరుణాల వంటి అనేక పండుగలు,వాటి విశిష్టత మీద పరిశోధనలు చేయడానికి, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, పెయింటింగ్ వంటి పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటానికి, కోయ డ్యా న్స ట్రూప్స, కొమ్ము కోయ, రేలా డ్యా న్స ట్రూప్స, పెయింటింగ్ వంటివాటిని చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించి వాటికి ఆర్థిక సహాయం అందించటానికి ఉపయోగిస్తామన్నారు.


అలాగే “స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, పర్యా టక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్ల అభివృద్ధిలో భాగంగా 2016-17 లోనే దాదాపు 80 కోట్లరూపాయలతోములుగు - లక్నవరం -మేడవరం -తాడ్వా యి- దామరవి - మల్లూర్ - బోగత జలపాతాలలో సమగ్ర అభివృద్ధిని చేపట్టడం జరిగిందని అన్నా రు. అందులోభాగంగా మేడారంలో అతిథి గృహాన్ని, ఓపెన్ ఆడిటోరియం, పర్యా టకుల కోసం విడిది గృహాలు, త్రాగునీరు వంటి వివిధ సౌకర్యా లు, సోలార్ లైట్లు వంటి వాటిని ఏర్పా టు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది గిరిజన భక్తులు హాజరు కానున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-02-13T22:09:28+05:30 IST