TS news: పుట్టినరోజు వేడుకలకు దూరం ఉండాలని కేటీఆర్ నిర్ణయం
ABN , First Publish Date - 2022-07-23T16:18:40+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకల(Birthday celebrations)కు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. వర్షాల వలన, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్(TRS) పార్టీ శ్రేణులు తమకు తోచిన మేర "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.