రాబోయే రోజుల్లో డిటర్జెంట్ లిక్విడ్ అధికంగా వినియోగిస్తారు: కేటీఆర్

ABN , First Publish Date - 2022-05-02T23:35:25+05:30 IST

రానున్న రోజుల్లో డిటర్జెంట్ లిక్విడ్ వినియోగం అధికం అవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు.

రాబోయే రోజుల్లో డిటర్జెంట్ లిక్విడ్ అధికంగా వినియోగిస్తారు: కేటీఆర్

మహబూబ్ నగర్: రానున్న రోజుల్లో డిటర్జెంట్ లిక్విడ్ వినియోగం అధికం అవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ పరిశ్రమ ఆర్ధికంగా పురోగమిస్తుందన్నారు. సోమవారం షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూర్ మండలంలోని పెంజర్ల గ్రామంలో పీఅండ్ జి అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల యూనిట్ ను మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, శాసన సభ్యులు అంజయ్య యాదవ్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పి అండ్ జి ఆధ్వర్యంలో  200 కోట్లపైగా పెట్టుబడులతో  నెలకొల్పిన యూనిట్ ను ప్రారంభించుకోవడం చాల సంతోషంగా వుందన్నారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమీషనర్ క`ష్ణ భాస్కర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read more