తెలంగాణకు తరలి వచ్చే పరిశ్రమల్లో స్ధానికులకే ఉపాధి: కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-31T21:09:52+05:30 IST

వివిధ దేశాల నుంచి, రాష్ర్టాల నుంచి తెలంగాణకు తరలి వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి లభించేలా చూస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు.

తెలంగాణకు తరలి వచ్చే పరిశ్రమల్లో స్ధానికులకే ఉపాధి: కేటీఆర్

హైదరాబాద్: వివిధ దేశాల నుంచి, రాష్ర్టాల నుంచి తెలంగాణకు తరలి వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి లభించేలా చూస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోకి 1500 కోట్ల పెట్టుబడితో డ్రిల్ మెక్ సంస్థ ముందుకు వచ్చిందని, ఈ పరిశ్రమ ద్వారా 2500 మందికి ఉపాధి దక్కుతుందని, ఇందులో 80శాతం స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ర్టాలను కాదని హైదరాబాద్ లో డ్రిల్ మెక్ స్పా సంస్థ తమ యూనిట్ ఏర్పాటు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. 


ఇటలీకి చెందిన డ్రిల్ మెక్ స్పా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు సోమవారం తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏడున్నరేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందన్నారు. దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్ గా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణలో కేంద్రం పరిశ్రమల స్ధాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఢిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-31T21:09:52+05:30 IST