రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: కేటీఆర్

ABN , First Publish Date - 2021-12-23T22:04:09+05:30 IST

రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర బాగుంటేనే

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: కేటీఆర్

హైదరాబాద్: రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర బాగుంటేనే దేశం బాగుంటుంది అనేదే తమ విధానమని ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు ట్విట్టర్​ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్​ నేతృత్వంలో సాగులో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో రైతులు ఇ‌బ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డులను తిరగ రాసిందన్నారు. ధాన్యం కొనుగోలులో నిజాలు ఏమిటో తెలుసుకుందామంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆ ట్వీట్‌‌లో కేటీఆర్​  వివరించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని కేంద్రానికి ఎన్నోసార్లు తాము విజ్ఞప్తులు  చేశామన్నారు.



Updated Date - 2021-12-23T22:04:09+05:30 IST