కేసీఆర్ లేకుంటే టీపీసీసీ.. టీ బీజేపీ ఉండేదా?: KTR

ABN , First Publish Date - 2021-10-05T00:46:54+05:30 IST

కేసీఆర్ లేకుంటే టీపీసీసీ.. టీ బీజేపీ ఉండేదా?: KTR

కేసీఆర్ లేకుంటే టీపీసీసీ.. టీ బీజేపీ ఉండేదా?: KTR

హైదరాబాద్: 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది ఏం లేదని ఓ ప్రకటనలో మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మునుగోడు నియోజికవర్గానికి ఫ్లోరోసిస్ ఇచ్చిందన్నారు. తెలంగాణ తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి అయితే ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం టైంలో చంద్రబాబు పక్కన ఉండి ఉద్యమ కారులపై దాడుల చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. శ్రీకాంతాచారికి ఉద్యమ ద్రోహులు నివాళులు అర్పించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆరే లేకుంటే టీపీసీీసీ.. టీ బీజేపి ఉండేదా అని ప్రశ్నించారు.  బీజేపీ చేసింది ప్రజాసంగ్రామ యాత్ర కాదని.. తిన్నది అరగక చేసినా అజీర్తి యాత్ర అని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్ళకి తెలిసింది హిందూ ముస్లిం ఒకటేనన్నారు. మిషన్ భగీరథ నీళ్లు తాగి పచ్చని పంట పొలాల్లో యాత్ర చేసిన బీజేపీ నాయకులకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-05T00:46:54+05:30 IST