నడ్డాకు సిగ్గుందా?: కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-05T22:24:30+05:30 IST

బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు

నడ్డాకు సిగ్గుందా?: కేటీఆర్

హైదరాబాద్: బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేందుకు నడ్డాకు సిగ్గుందా అని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్‌కి, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన అని కువిమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నేతలు పాలించకూడదా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీలో కుటుంబ పాలన గురించి ఎందుకు చెప్పట్లేదని ఆయన నిలదీశారు. కేంద్ర హోం అమిత్‌షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా వచ్చిందో నడ్డా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జేపీ నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ మంత్రిగా లేరా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసింది బీజేపీ కాదా అని ఆయన పేర్కొన్నారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చింది మీరు కాదా అని కేటీఆర్ మండిపడ్డారు. 


నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు నకలు కొట్టి కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన హర్ ఘర్ జల్‌కు స్ఫూర్తి మిషన్ భగీరథ కాదో అవునో సమధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-05T22:24:30+05:30 IST