ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-10T22:17:00+05:30 IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పంజాబ్ క్రీడాకారిణి మాలికా హండాకు కేటీఆర్ సాయం చేస్తానని ట్విట్టర్‌‌లో తెలిపారు. చెప్పినట్లే మాట నిలుపుకున్నారు. తన కార్యాలయంలో...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పంజాబ్ క్రీడాకారిణి మాలికా హండాకు కేటీఆర్ సాయం చేస్తానని ట్విట్టర్‌‌లో తెలిపారు. చెప్పినట్లే మాట నిలుపుకున్నారు. తన కార్యాలయంలో క్రీడాకారిణి మాలికాతో భేటీ అయిన అనంతరం ఆమెకు సాయం చేశారు. ఈ సందర్భంగా మాలికా సాధించిన మెడల్స్‌ను మంత్రికి చూపించారు. ఆమెకు మంత్రి కేటీఆర్ రూ. 15 లక్షలు ఆర్థిక సాయం అందించారు. దాంతో పాటు ఆమె భవిష్యత్ కోసం ల్యాప్‌టాప్ కూడా అందించారు. ట్యాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. 

Updated Date - 2022-01-10T22:17:00+05:30 IST