KTR angry with Shah: కేసీఆర్‌ రైతు వ్యతిరేకని షా అనడం ఈ శతాబద్దపు జోక్

ABN , First Publish Date - 2022-08-22T16:36:16+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేకి అంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KTR angry with Shah: కేసీఆర్‌ రైతు వ్యతిరేకని షా అనడం ఈ శతాబద్దపు జోక్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రైతు వ్యతిరేకి అంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amith shah) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ (KCR)ను అమిత్ షా (Union minister) రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అని అన్నారు. ఒకవైపు కేసీఆర్ (Telangana CM) ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు (Rythu bandhu) వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పీఎం కిసాన్‌ (PM Kisan)గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఎవరిదని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత.... దేశ రైతాంగం యొక్క తీవ్ర వ్యతిరేకత వలన క్షమాపణ చెప్పిన వారెవరని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం (Central government) యొక్క ఫసల్ బీమా యోజన (Fasal Bima Yojana)లో చేరలేదని కేసీఆర్‌ను విమర్శిస్తున్న అమిత్ షా, మరి గుజరాత్ ప్రభుత్వం (Gujarath government) అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో.. అదే పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ పథకం తెలంగాణ రాష్ట్రాని (Telangana state)కి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలి’’ అని అన్నారు. ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని అమిత్ షా వదిలిపెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. 

Updated Date - 2022-08-22T16:36:16+05:30 IST