KTR: వేసవి కన్నా ముందే సోలార్ రూప్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-09-06T20:04:28+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణహితమైన మోటార్ ట్రాన్స్‌పోర్ట్‌ను తేవాలని అనుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

KTR: వేసవి కన్నా ముందే సోలార్ రూప్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటు

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణహితమైన మోటార్ ట్రాన్స్‌పోర్ట్‌ను తేవాలని అనుకున్నామని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మంగళవారం ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ (Solar roof cycle track)కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ (Telangana minister) మాట్లాడుతూ... 160 కిలో మీటర్ల ఓఆర్‌ఆర్‌ను సరిగా ఉపయోగించుకోవాలని అనుకున్నామన్నారు. ఇక్కడి ఐటీ కారిడార్‌లో ఉన్నవారు సైక్లింగ్ చేసుకుంటూ ఆఫీస్‌కు వెళ్ళే విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇక్కడ శ్రీకారం చుట్టినట్లు మంత్రి  చెప్పారు.


అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నమెంట్‌ను నిర్వహించే విధంగా ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే వేసవి కన్నా ముందే నగరవాసులకు అందజేస్తామని తెలిపారు. భవిష్యత్‌లో సోలార్‌ రూఫ్‌తో కరెంట్‌ ఉత్పత్తి చేస్తామన్నారు. రెండవ దశలో గండిపేట చుట్టూ 46 కిలో మీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, రిసార్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-06T20:04:28+05:30 IST