వంట గ్యాస్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-07T22:36:27+05:30 IST

Hyderabad: మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. వంట గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై

వంట గ్యాస్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Hyderabad:  మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. వంట గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై కేంద్రం తెరచాటు దాడికి తెగబడుతుందని విమర్శించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దుర్భర స్థితిలో కేంద్రం ఉందని వ్యాఖ్యానించారు.  

సంవత్సరంలో రూ. 244 వడ్డన

మోదీ సర్కారు మరో పిడుగు వేసింది.  14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 మేర పెంచింది. దీంతో సిలిండర్‌ ధర రూ. 1,055 నుంచి రూ. 1,105కు పెరిగింది. బుధవారం నుంచే తాజా ధరలు అమల్లోకి వచ్చినట్టు ఆయిల్‌ కంపెనీలు పేర్కొన్నాయి. 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌పై గత నాలుగు నెలల్లో నాలుగుసార్లు ధర పెంచడం గమనార్హం. మార్చి 22న రూ. 50, మే 7న మరో రూ. 50, మే 19న రూ. 3.50 చొప్పున ధరను పెంచారు. తాజాగా మరో రూ. 50 పెంపును కలుపుకొని మార్చి 22 నుంచి ఇప్పటివరకూ రూ. 153.50 పెంచారు. ఇక జూన్‌ 2021 నుంచి ఇప్పటివరకూ ఎల్పీజీపై ఏకంగా రూ. 244 వడ్డించారు.

తగ్గిన సబ్సిడీ

గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీని కేంద్రం తగ్గించేసింది. ఒక్కో సిలిండర్‌పై అది చాలా తక్కువగా రూ.40.79గానే ఉన్నది. పెరిగిన ఇంధన ధరలతో వాహనాలను బయటకు తీసే పరిస్థితి లేదు.  

Updated Date - 2022-07-07T22:36:27+05:30 IST