Basara IIT Students Great.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-09-26T22:11:36+05:30 IST

Basara IIT విద్యార్థులపై మంత్రి కేటీఆర్ (Minister Ktr) ప్రశంసించారు. బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. తమ ఉపన్యాసాలను విద్యార్థులు ....

Basara IIT Students Great.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

నిర్మల్ (Nirmal): Basara IIT విద్యార్థులపై మంత్రి కేటీఆర్ (Minister Ktr) ప్రశంసించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలసి ఆయన బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తమ ఉపన్యాసాలను విద్యార్థులు వినరని తన కాలేజీ రోజుల్లో కూడా వినేవాళ్ల కాదని చెప్పారు. సెల్‌ఫోన్‌లు చేతిలో ఉన్నాక ఇంకేం చదువుతారన్నారు. తన కుమారుడిని కూడా రోజూ చూస్తున్నానన్నారు. బాసర విద్యార్థులు చేసిన ఆందోళన అభినందనీయని చెప్పారు. శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలపడం చాలా గ్రేట్‌ అని ప్రశంసించారు. 2 నెలల్లో మరోసారి బాసర క్యాంపస్‌ను సందర్శిస్తానని విద్యార్థులకు మంత్రి కేటీఆర్ తెలిపారు. 


కాగా బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీ క్యాంటీన్‌లో భోజనం సరిగాలేదని.. కాంట్రాక్టర్‌ను మార్చాలని.. యూనివర్సిటీకి శాశ్వత వీసీని నియమించాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్చలు సఫలంకావడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ప్రశాంతంగా క్లాసులు జరుగుతుండంతో మంత్రి కేటీఆర్ పర్యటించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 


అయితే మంత్రి కేటీఆర్ పర్యటన దృష్టా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటాయన్న సమాచారంతో క్యాంపస్ వద్ద భారీగా మోహరించారు. పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలువుర్నిముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 



Updated Date - 2022-09-26T22:11:36+05:30 IST