ఉక్రెయిన్‌‌కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తే.. ఖర్చులు భరిస్తాం: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-02-25T18:17:25+05:30 IST

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వారిని త్వరితగతిన భారత్‌కు రప్పించాలంటూ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.

ఉక్రెయిన్‌‌కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తే.. ఖర్చులు భరిస్తాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వారిని త్వరితగతిన భారత్‌కు రప్పించాలంటూ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు  ట్విట్టర్ ద్వారా మంత్రి విజ్ఙప్తి చేశారు. ఉక్రెయిన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తే ఖర్చులు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇందుకోసం తక్షణమే ఏర్పాట్లు చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని మంత్రి కేటీఆర్ కోరారు. 


రెండో రోజు యుద్ధం...తెలుగు విద్యార్థుల ఆవేదన

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం రెండో రోజు కొనసాగుతోంది. యుద్ధంలో అనేక మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపుఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు  యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమ బిడ్డలను స్వదేశానికి తీసుకురావాల్సింది భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 



Updated Date - 2022-02-25T18:17:25+05:30 IST