భారత్‌లో సక్సెస్‌‌ఫుల్ స్టార్టప్ అంటే తెలంగాణ: మంత్రి KTR

ABN , First Publish Date - 2022-03-02T18:37:26+05:30 IST

దేశంలో సక్సెస్ ఫుల్ స్టార్ట్ అప్ అంటే తెలంగాణ రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు.

భారత్‌లో సక్సెస్‌‌ఫుల్ స్టార్టప్ అంటే తెలంగాణ: మంత్రి KTR

హైదరాబాద్: దేశంలో సక్సెస్ ఫుల్ స్టార్ట్ అప్ అంటే తెలంగాణ రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సీఐఐ సమ్మిట్‌లో మంత్రి మాట్లాడుతూ...ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రంలో ఎన్నో స్టార్టప్‌లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నాయన్నారు. టీఎస్ ఐ పాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నా.. మౌలిక వసతుల్లో ముందుకు దూసుకెళ్తున్నామన్నారు. అగ్రి ఉత్పత్తులు కూడా రాష్ట్రంలో బాగా పెరిగాయని ఆయన  అన్నారు. రైతులకు సాయం అందించేందుకు రైతు బంధు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కూడా రాష్ట్రంలో వేగంగా జరుగుతోందన్నారు. ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజితో చాలా మందికి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ఇన్వెస్ట్ ఇండియా కూడా పరిశ్రమలకు మరింత సహకారం అందించాలన్నారు. సీఐఐ కూడా కేంద్రం దగ్గర గట్టిగా మాట్లాడి కొత్త పరిశ్రమలకు లబ్ది చేకూరేలా చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. 

Updated Date - 2022-03-02T18:37:26+05:30 IST