భీమిలిలో డిఫెన్స్ పార్క్: మంత్రి మేకపాటి

Nov 29 2021 @ 18:29PM

విశాఖపట్నం: జిల్లాలోని భీమిలిలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటించారు. నగరంలో జరుగుతున్న దేశీ-2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్‌షాప్‌నకు మంత్రి  మేకపాటి, మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో  పలు పరిశ్రమలకు రాయితీలు చెల్లించామన్నారు. ఐటీ పరిశ్రమకు రూ. 30 కోట్ల బకాయిలు ఉన్నానమని, వాటిని త్వరలో చెల్లిస్తామని మేకపాటి తెలిపారు. ఈ కార్యక్రమానికి  డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ, అధికారులు వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్‌గా హాజరయ్యారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.